Kona Venkat

Kona Venkat: అలాంటి దర్శకులు క్రిమినల్స్‌తో సమానం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి!

Kona Venkat: టాలీవుడ్ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సరైన ప్లానింగ్ లేకుండా మితిమీరిన రన్‌టైమ్‌తో షూటింగ్‌లు చేయడం, తీరా ఎడిటింగ్ టేబుల్ వద్ద గంటల కొద్దీ ఫుటేజీని లేపేయడం వల్ల నిర్మాతలు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నటుడు శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

గంటల ఫుటేజీ లేపేస్తే ఎవరికి లాభం? – అలాంటి వాళ్లు క్రిమినల్స్

దర్శకుల పనితీరు, బాధ్యతారాహిత్యంపై కోన వెంకట్ సూటిగా ప్రశ్నలు సంధించారు. “సినిమా తీసేటప్పుడు దర్శకులకు కనీశం బాధ్యత లేకుండా పోతుంది. అసలు ఏం తీస్తున్నామో అన్న క్లారిటీ లేకపోతే ఎలా? ఏకంగా 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల నిడివితో షూట్ చేసి, ఎడిటింగ్ టేబుల్ దగ్గర గంటకు పైగా ఫుటేజీని పక్కన పడేస్తే ఎవరికి ఉపయోగం? ఇటీవల ఓ సినిమాలో ఏకంగా రెండు గంటల ఫుటేజీని ఎడిటింగ్‌లో తీసేశారు. దీనివల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది” అని మండిపడ్డారు.
ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి..
“సినిమా హిట్టవుతుందా లేదా అన్నది మన చేతుల్లో ఉండదు. కానీ ఎంత తీయాలనే దానిపై డైరెక్టర్‌కు స్పష్టమైన ప్లానింగ్ ఉండాలి. 40 రోజుల పాటు షూట్ చేసిన సన్నివేశాలను నిర్దాక్షిణ్యంగా డస్ట్‌బిన్‌లో పడేస్తే నిర్మాత పరిస్థితి ఏంటి? నిర్మాత కుటుంబాన్ని రోడ్డున పడేసే అలాంటి నిర్లక్ష్యపు దర్శకులు క్రిమినల్స్‌తో సమానం. వారిని చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా బ్యాన్ చేయాలి” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నా ఉద్దేశం ఒక్కటే – వాళ్లు మారాలి..
ఈ వ్యాఖ్యలపై చర్చ జరగడంతో శనివారం ప్రెస్ మీట్‌లో ఆయన మరింత స్పష్టతనిచ్చారు: “లాస్ట్‌లో సినిమా చూశాక ఒకటి రెండు ప్యాచ్ వర్క్‌లు చేసుకోవడం వేరు. కానీ కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన సీన్లను ఇష్టం వచ్చినట్లు కట్ చేయడం దారుణం. నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకుని దర్శకులు మారాలన్నదే నా తపన.”
పాన్-ఇండియా మోజులో పడి హీరోలు వర్కర్ల పొట్టకొడుతున్నారు:
కేవలం దర్శకులపైనే కాకుండా, హీరోల తీరుపైనా కోన వెంకట్ అసహనం వ్యక్తం చేశారు:
  • సంవత్సరాల తరబడి ఒక్కో సినిమా:
    హీరోలు పాన్-ఇండియా మోజులో పడి నాలుగైదు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారని విమర్శించారు.
  • ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకం:
    గతంలో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారని, కనీసం సంవత్సరానికి రెండు చిత్రాలైనా వస్తేనే సినీ కార్మికులకు పని దొరుకుతుందని, పరిశ్రమలో నిధులు రొటేట్ అవుతాయని స్పష్టం చేశారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’ సెన్సార్ వివాదంపై క్లారిటీ..

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి ఎదురైన సెన్సార్ సమస్యలపైనా కోన వెంకట్ స్పందించారు:
  • ‘నక్సలైట్’ స్థానంలో ‘అన్న’:
    చిత్రంలో ఉపయోగించిన ‘నక్సలైట్’ అనే పదంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో, దాన్ని ‘అన్న’గా మార్చామని చెప్పారు. అయితే గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్, విజువల్స్ విషయంలో మార్పులు సాధ్యం కాదని చెప్పినట్లు పేర్కొన్నారు.
  • రివైజింగ్ కమిటీ ద్వారా యూ/ఏ:
    ఈ ఇబ్బందుల వల్ల ఢిల్లీకి వెళ్లి రివైజింగ్ కమిటీ ద్వారా ‘U/A’ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. సర్టిఫికెట్ ఏదైనా బలమైన కంటెంట్, కథ ఉంటేనే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని చెప్పారు.
జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కర్నాటి నిర్మించిన ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, సత్య కీలక పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *