Abhijeet Dipke Arrest (1)

Abhijeet Dipke: అభిజీత్ దీప్కేకు తీరని విషాదం.. నానమ్మ కన్నుమూత.. అంత్యక్రియలకు అనుమతిస్తారా?

Abhijeet Dipke: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వయోభార సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న అభిజీత్ దీప్కేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు.

కుటుంబంలో తీవ్ర శోకం – పోలీసుల అనుమతిపై ఉత్కంఠ.. 

నానమ్మ మరణవార్తతో మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న అభిజీత్ దీప్కేను మానవతా దృక్పథంతో నానమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *