Dastagiri

Dastagiri: బ్రెడ్డులో విషం కలిపి నన్ను చంపాలని చూశారు.. !

Dastagiri: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి మరోసారి తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. తాను జైలులో ఉన్న సమయంలో తనను అంతమొందించేందుకు కొందరు పక్కా ప్లాన్ వేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మహా న్యూస్ (Mahaa News) ఛానెల్‌తో  ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.

దస్తగిరి చేసిన ప్రధాన ఆరోపణలు..

తాను జైలులో ఉన్న రోజుల్లో జైలు లోపల ఉండే బేకరీలో పనిచేసే వ్యక్తి ద్వారా తినే బ్రెడ్డులో విషం కలిపి తనను చంపడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. అలాగే తన హత్యకు జైలులోనే స్కెచ్ వేశారని చెబుతూ.. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్, వైఎస్ భారతి, భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి పేర్లను ఆయన ఆరోపణల్లో ప్రస్తావించారు. చైతన్య రెడ్డిని జైలు లోపలికి పంపించి తనను బెదిరించారని పేర్కొన్నారు.

జైలు అధికారులు, ఖైదీల హెచ్చరికలు..
జైలులో ఉన్న కొందరు అధికారులు కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని, తోటి ఖైదీలు ఇచ్చిన సమాచారం, సహకారంతోనే తాను ప్రాణాలతో బయటపడగలిగానని చెప్పారు. కొందరు జైలు అధికారులు కూడా ఈ కుట్రదారులకు సహకరించారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ విచారణకు డిమాండ్..
తన హత్యకు ప్లాన్ చేసిన వారిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తే అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని దస్తగిరి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *