Rakul Preet Singh 

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. విదేశాలకు నిధుల మళ్లింపు..?

Rakul Preet Singh: బాలీవుడ్ ప్రముఖ నటి రకూల్ ప్రీత్ సింగ్, ఆమె మామ ఇంకా ప్రముఖ సినీ  నిర్మాత వాసు భగ్నానీ, అలాగే పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన కార్యాలయాలు, నివాసాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు అనుమానాల నేపథ్యంలో ముంబైలోని సుమారు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. సినీ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు చూపుతూ పెద్ద ఎత్తున నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ఐటీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఐటీ సోదాల వివరాలు – నిధుల మళ్లింపుపై దృష్టి..

ముంబై ఆదాయపు పన్ను శాఖకు చెందిన పలు ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. రకూల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ, పనోరమా స్టూడియోస్ ఆఫీసులతో పాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
సినిమా నిర్మాణ ప్రాజెక్టులకు పెట్టుబడులు, ఫైనాన్సింగ్ పేరిట అక్రమంగా విదేశీ ఖాతాలకు (Overseas Transactions) నిధులను మళ్లించినట్లు వచ్చిన సమాచారంతో అధికారులు ఈ సోదాలు ప్రారంభించారు.
సంస్థల గత కొన్నేళ్ల బ్యాలెన్స్ షీట్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓవర్‌సీస్ నగదు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
గతంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు నేపథ్యం..
గతంలో రకూల్ ప్రీత్ సింగ్ కుటుంబం చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.. గత ఏడాది డిసెంబర్ (2025 డిసెంబర్ 19)లో ముంబై పోలీసులు డ్రగ్స్ కేసులో రకూల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈగల్ (EAGLE) ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ (MDMA) మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ ఇద్దరు పెడ్లర్ల వద్ద నుంచి అమన్ ప్రీత్ సింగ్ దాదాపు ఐదుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఇప్పుడు ఏకంగా సినిమా నిర్మాణ రంగంలో నిధుల మళ్లింపు ఆరోపణలతో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *