Danam Nagender: హైదరాబాద్ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎన్నికల్లో న్యాయబద్ధంగా కాకుండా కేవలం ‘ఓటు చోరీ’ (ఓట్ల దొంగతనం) ద్వారానే విజయాలు సాధిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు వెనుక ఈ ఓటు చోరీ కుట్రలే ఉన్నాయని, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి కూడా అలాగే గెలిచారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దానం.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారీ బంధం ఉందంటూ నిప్పులు చెరిగారు.
దానం నాగేందర్ చేసిన ప్రధాన వ్యాఖ్యలు..
ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేయడంలో బీఆర్‌ఎస్ ఆరితేరిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా కాపాడేందుకు, రక్షించేందుకే బీఆర్‌ఎస్ సరికొత్త డ్రామాలకు తెరలేపుతోందని, రెండు పార్టీలూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని దానం ఎద్దేవా చేశారు.
