Accident

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు కింద నలిగి చిన్నారి మృతి

Accident: కళ్లముందే అల్లారుముద్దుగా తిరుగుతూ ఆడుకుంటున్న పసికందును వేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులు సరుకులు కొనే పనిలో ఉండగా, ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన చిన్నారిని ఓ స్కార్పియో కారు అతివేగంగా ఢీకొట్టి, చిన్నారి శరీరంపై నుంచి దూసుకెళ్లింది. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సాంచోర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అసలేం జరిగింది?

కుటుంబ సభ్యులు తమ చిన్నారితో కలిసి స్థానికంగా ఉన్న ఓ కిరాణా దుకాణానికి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. దుకాణం లోపల పెద్దలు సరుకులు కొనుగోలు చేస్తూ అందులో నిమగ్నమై ఉండగా.. చిన్నారి ఎవరికీ తెలియకుండా ఆడుకుంటూ నెమ్మదిగా దుకాణం బయటకు, రోడ్డుపైకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో కారు చిన్నారిని బలంగా ఢీకొట్టింది. కారు చక్రాల కింద చిన్నారి నలిగిపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
డ్రైవర్ పరారీ – సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు..
చిన్నారిని ఢీకొట్టిన తర్వాత వాహనాన్ని నిలపకుండా డ్రైవర్ మరింత వేగంగా కారును ముందుకు పోనిచ్చి ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన హృదయవిదారక దృశ్యాలు సమీపంలోని దుకాణాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలారుకుని చిన్నానికి చేరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనం నంబర్‌ను గుర్తించి, పరారీలో ఉన్న స్కార్పియో డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తమ కళ్లముందే చిన్నారి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు చూపరులను తీవ్రంగా కలచివేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *