BJP In-Charges: దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇంఛార్జ్‌లు, సహ-ఇంఛార్జ్‌లను నియమిస్తూ పూర్తి స్థాయి జాబితాను విడుదల చేసింది. ఈ తాజా నియామకాల్లో సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల నాయకులకు దక్కిన పదవులు..
-
దగ్గుబాటి పురందేశ్వరి: ఒడిశా రాష్ట్ర పూర్తిస్థాయి ఇంఛార్జ్‌గా నియామకం.
-
రామ్ మాధవ్: తమిళనాడుతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఇంఛార్జ్‌గా ద్వంద్వ బాధ్యతలు.
-
డీకే అరుణ: తమిళనాడు రాష్ట్ర సహ-ఇంఛార్జ్‌గా ఎంపీ డీకే అరుణకు బాధ్యతలు.
-
కాసం వెంకటేశ్వర్లు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు కర్ణాటక సహ-ఇంఛార్జ్‌గా ఎంపిక.
తెలంగాణ, ఏపీ ఇంఛార్జ్‌ల వివరాలు..
-
తెలంగాణ:
-
ఇంఛార్జ్: సునీల్ బన్సల్
-
సహ-ఇంఛార్జ్‌లు: రేఖా శర్మ, అభయ్ పాటిల్
-
-
ఆంధ్రప్రదేశ్:
-
ఇంఛార్జ్: అరవింద్ భదౌరియా
-
సహ-ఇంఛార్జ్: వనతి శ్రీనివాసన్
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పూర్తి జాబితా..
| రాష్ట్రం / యూటీ | ఇంఛార్జ్ | సహ-ఇంఛార్జ్(లు) |
| అండమాన్ & నికోబార్ | జై ప్రకాష్ (ఢిల్లీ) | – |
| అరుణాచల్ ప్రదేశ్ | దేవేష్ కుమార్ (బీహార్) | – |
| ఆంధ్రప్రదేశ్ | అరవింద్ భదౌరియా | వనతి శ్రీనివాసన్ |
| అస్సాం | మంగళ్ పాండే | ఫాంగ్నాన్ కోన్యాక్, మనోజ్ టిగ్గా |
| బీహార్ | హరీష్ ద్వివేది | సంగీత యాదవ్, రోహన్ గుప్తా |
| చండీగఢ్ | మహేంద్ర పాండే | – |
| ఛత్తీస్‌గఢ్ | స్మృతి ఇరానీ | సిద్ధార్థ శంభు |
| దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ | వర్షాబెన్ నరేంద్ర భాయ్ దోషి | – |
| ఢిల్లీ | వినయ్ సహస్రబుద్ధే | జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, దర్శన జర్దోష్ |
| గోవా | డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ | అనిల్ ఆంటోనీ |
| గుజరాత్ | తరుణ్ చుగ్ | అజయ్ మహావార్, గోమతి సాయి |
| హర్యానా | స్మృతి ఇరానీ | భోలా సింగ్ |
| హిమాచల్ ప్రదేశ్ | శ్రీకాంత్ శర్మ | దర్శన సింగ్ |
| జమ్మూ & కాశ్మీర్ | డాక్టర్ సతీష్ పూనియా | రీనా కశ్యప్ |
| జార్ఖండ్ | గజేంద్ర పటేల్ | సౌరభ్ సింగ్, నివేదిత సింగ్ |
| కర్ణాటక | హరీష్ ద్వివేది | కాసం వెంకటేశ్వర్లు |
| కేరళ | ఎం. నాగరాజ | ఎం. వెంకటేశన్ |
| లడఖ్ | రాజ్‌కుమార్ భాటియా (ఢిల్లీ) | – |
| లక్షద్వీప్ | జార్జ్ కురియన్ | – |
| మధ్యప్రదేశ్ | బిప్లవ్ కుమార్ దేవ్ | రేఖా వర్మ |
| మహారాష్ట్ర | బైజయంత జయ పాండా | అమిత్ మాల్వియా, సదానంద్ షెట్ తనవాడే, కమల్జీత్ సెహ్రావత్ |
| మణిపూర్ | డాక్టర్ రాజ్‌దీప్ రాయ్ | – |
| మేఘాలయ | కనద్ పుర్కాయస్థ | నుమల్ మోమిన్ |
| మిజోరాం | డాక్టర్ భగవత్ కరాద్ | – |
| నాగాలాండ్ | అనిల్ ఆంటోనీ | – |
| ఒడిశా | దగ్గుబాటి పురందేశ్వరి | స్వదేశ్ సింగ్ |
| పుదుచ్చేరి | కె. సురేంద్రన్ | – |
| పంజాబ్ | డాక్టర్ సతీష్ పూనియా | వీరేంద్ర సచ్‌దేవా, అల్కా గుర్జర్ |
| రాజస్థాన్ | సంజయ్ భాటియా | కవితా పటీదార్, కుల్జీత్ చాహల్ |
| సిక్కిం | రాజు బిస్తా | – |
| తమిళనాడు | రామ్ మాధవ్ | నిర్మల్ కుమార్ సురానా, డీకే అరుణ |
| తెలంగాణ | సునీల్ బన్సల్ | అభయ్ పాటిల్, రేఖా శర్మ |
| త్రిపుర | మృగాంక దేబ్ బర్మన్ | – |
| ఉత్తర ప్రదేశ్ | వినోద్ తావ్డే | జగదీష్ పటేల్, ప్రదీప్ శర్మ, అనంత్ ఓజా |
| ఉత్తరాఖండ్ | రామ్ మాధవ్ | అరవింద్ మేనన్, బాన్సురి స్వరాజ్ |
| పశ్చిమ బెంగాల్ | సునీల్ బన్సల్ | లాల్ సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహ |
రాబోయే సార్వత్రిక, శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకే ఈ నియామకాలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
