The Paradise: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తొలిసారి మీడియా ముందుకు వచ్చి సినిమా కథ, ట్రైలర్ రిలీజ్ కాకపోవడానికి గల కారణాలు, రన్‌టైమ్‌పై పూర్తి వంటి వివరాలపైనా పూర్తి క్లారీటీ ఇచ్చారు.
ట్రైలర్ రిలీజ్ లేదు – నాని క్లారిటీ..
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ, ‘ది ప్యారడైజ్’ సినిమాకి ఎలాంటి ట్రైలర్ ఉండబోదని నాని, శ్రీకాంత్ ఓదెల అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 24న సినిమాను ఆన్‌టైమ్‌లో తీసుకురావడానికి యూనిట్ రాత్రింబవళ్లు పనిచేస్తోందని, ట్రైలర్ కట్ చేయడానికి కనీశం 4రోజులు టైమ్ కేటాయించాలి ఆలా చెయ్యడం వల్ల సినిమా అవుట్ ఫుట్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రైలర్ లేకుండా(చూడకుండా ) థియేటర్ లోనే డైరెక్ట్ గా సినిమా చుస్తే ఒక్క కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పారు నాని.
ది ప్యారడైజ్’ తుది రన్‌టైమ్‌ను 2 గంటల 49 నిమిషాలుగా (169 నిమిషాలు) లాక్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, శ్రీకాంత్ రా ఎమోషన్స్, నాని సరికొత్త అల్ట్రా మాస్ రోల్ వెరసి సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
