The Paradise

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఉండదా?.. డైరెక్ట్‌గా థియేటర్లలోనే కే సినిమా..!

The Paradise: న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అల్ట్రా మాస్ అవతారంలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ కాన్వాస్, భారీ స్కేల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన అనిరుధ్ రవిచందర్ మాస్ సాంగ్స్ (‘ఆయా షేర్’, ‘ఏషా నాగుల కట్టమీద’) ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

గతంలో రెండు సార్లు వాయిదా పడినప్పటికీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని మేకర్స్ స్పష్టం చేస్తూ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే, సినిమా ప్రమోషన్లకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది.
ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ రిలీజ్?..
ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, మేకర్స్ ‘ది ప్యారడైజ్’ సినిమాకి అధికారిక థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయకుండా.. నేరుగా సినిమానే థియేటర్లలోకి తీసుకురావాలనే సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ విడుదల చేయకుండా సినిమాను నేరుగా రిలీజ్ చేసే సంప్రదాయం టాలీవుడ్‌లో గతంలోనూ కొన్ని సినిమాలకు జరిగింది. కొన్ని చిత్రాలకు ఈ మిస్టరీ స్ట్రాటజీ కలిసిరాగా, మరికొన్నింటికి ఫలితం తేడా కొట్టింది. గతంలో వచ్చిన టీజర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. ఇలాంటి సమయంలో అసలైన కథ, హైప్ పెంచే ఎలివేషన్లను ట్రైలర్ ద్వారా చూపించకుండా డైరెక్ట్‌గా రిలీజ్ చేయడం కచ్చితంగా పెద్ద రిస్కే అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మేకర్స్ కేవలం ఈ ఆలోచనను పరిశీలిస్తున్నారు తప్పితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రానున్న నాలుగైదు రోజుల్లో ట్రైలర్ కట్ విడుదల చేయాలా లేదా డైరెక్ట్‌గా ఆడియన్స్‌ను థియేటర్లకే రప్పించాలా అన్న దానిపై స్పష్టత రానుంది.ట్రేడ్ వర్గాలతో పాటు నాని ఫ్యాన్స్ అందరి దృష్టి ఇప్పుడు సెప్టెంబర్ 24పైనే ఉంది. మరి భారీ అంచనాల మధ్య రానున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *