BRICS Summit 2026: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు రంగం సిద్ధమైంది. సదస్సు ప్రారంభానికి ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయమే భారత్ మండపానికి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ సాదరంగా ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది.
పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుక..
-
పారిశ్రామిక & మౌలిక వసతులు:రైల్వే రవాణా రంగంలో భారీ పెట్టుబడులు, కష్టతరమైన సొరంగాల (టన్నెల్) నిర్మాణం, ఉక్కు పరిశ్రమ అభివృద్ధిలో రష్యన్ పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.
-
రక్షణ & సాంకేతికత బదిలీ:రక్షణ సామగ్రి సరఫరాతో పాటు అధునాతన యుద్ధ విమానాల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ (ToT), కీలక రక్షణ విడిభాగాల ఉమ్మడి ఉత్పత్తిపై చర్చలు జరిగాయి.
-
ఇంధనం, కీలక ఖనిజాలు:ఎల్ఎన్జీ (LNG) సహజ వాయువు దిగుమతులు, పౌర అణు సహకారం, అణు ఇంధన సరఫరాలపై పటిష్ట నిర్ణయాలు తీసుకునేలా అడుగులు పడ్డాయి. భవిష్యత్ టెక్నాలజీకి ప్రాణవాయువైన ‘క్రిటికల్ మినరల్స్’ సరఫరాలో పరస్పర భాగస్వామ్యం, వ్యవసాయ రంగానికి ఎరువుల తయారీలో జాయింట్ వెంచర్లపై చర్చించారు.
-
భారతీయ నిపుణులకు ఉపాధి:నైపుణ్యం ఉన్న భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో మెరుగైన ఉపాధి లభించేలా ‘మొబిలిటీ’ ఒప్పందాల దిశగా కసరత్తు చేశారు.
బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్:
పుతిన్ మూడు రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించనున్నారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి భారత్ మండపం ఏర్పాట్లతో కూడిన 30 సెకన్ల వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “సదస్సుకు సర్వం సిద్ధం” అని ప్రకటించారు.
