Ranabaali Teaser: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) టీజర్ విడుదలైంది. బ్రిటిష్ పాలకుల అరాచకాలపై తిరగబడే వీరుడిగా విజయ్ దేవరకొండ ఊరమాస్, రా అండ్ రస్టిక్ అవతారంలో కనిపించిన తీరు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో మెప్పించిన విజయ్-రష్మిక మందన్న జంట ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
19వ శతాబ్దపు కరువు – తెల్లదొరలపై తిరుగుబాటు..
1854 నుంచి 1878 మధ్య మద్రాస్ ప్రెసిడెన్సీలో సంభవించిన భయానక కరువు, నాటి యథార్థ చారిత్రక పరిణామాల ఆధారంగా ఈ కథను రూపొందించారు. బ్రిటిష్ పాలనలో ప్రాణాలు కోల్పోయిన 80 లక్షల మంది భారతీయుల జ్ఞాపకార్థం అంటూ టీజర్ అత్యంత భావోద్వేగంగా మొదలవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’తో గట్టి పోటీ ఎదురుకానుంది.
