80s Retro Style: ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా 80s నాటి (1980s) క్లాసిక్ ఫ్యాషన్ జోరుగా నడుస్తోంది. పెద్ద హెయిర్‌స్టైల్స్, కలర్‌ఫుల్ కూలింగ్ గ్లాసెస్, పాతకాలం నాటి వింటేజ్ పోజులతో నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీనికోసం వాళ్లేమీ పాత ట్రంకు పెట్టెలు వెతికి బట్టలు మార్చుకోవట్లేదు తమ సాధారణ సెల్ఫీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పాతకాలపు రెట్రో ఫోటోలుగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా చాట్‌జీపీటీ (ChatGPT) టెక్నాలజీ ఈ సరికొత్త వైరల్ ట్రెండ్‌కి అడ్డాగా మారింది.
ఎలా పనిచేస్తోంది ఈ 80ల ఫోటో ట్రెండ్?..
-
సులభమైన ప్రాంప్ట్స్:యూజర్లు తమ సాధారణ సెల్ఫీని చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి, ముఖ కవళికలు మారకుండా 1980ల కాలం నాటి శైలిలోకి మార్చాలని కొన్ని ప్రాంప్ట్స్ (ఆదేశాలు) ఇస్తున్నారు.
-
డిజిటల్ టైమ్ మెషీన్:ఏఐ ఆ ఫోటోను డిజిటల్ టైమ్ మెషీన్‌లా నాలుగు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లి.. నాటి హెయిర్‌స్టైల్స్, పెద్ద సన్‌గ్లాసెస్, వార్మ్ స్టూడియో లైటింగ్, పాతకాలం నాటి రంగులను జోడించి అచ్చమైన రెట్రో పోర్ట్రెయిట్‌ను అందిస్తోంది.
-
కస్టమైజ్డ్ బ్యాక్‌గ్రౌండ్స్:డిస్కో ఫ్లోర్, వింటేజ్ కార్లు, నాటి మ్యాగజైన్ కవర్ల వంటి బ్యాక్‌గ్రౌండ్‌లను కోరుకుంటూ యూజర్లు తమకు నచ్చిన 80ల అవతార్‌ను సృష్టించుకుంటున్నారు.
ఎందుకింత క్రేజ్ వచ్చింది?:
-
నాస్టాల్జియా & కొత్తదనం:గతాన్ని నెమరువేసుకోవడం (Nostalgia), అలాగే మనం ఆ కాలంలో పుట్టి ఉంటే ఎలా ఉండేవాళ్లమో సరికొత్తగా చూసుకోవాలనే సరదా ఈ ట్రెండ్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
-
సినిమాటిక్ స్టైల్:80ల నాటి టాలీవుడ్, బాలీవుడ్ హీరో హీరోయిన్ల క్లాసిక్ లుక్స్‌ను ఏఐ సులువుగా రీక్రియేట్ చేస్తుండటంతో నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
