Nara Lokesh

Nara Lokesh: నిజం గెలిచింది.. 53 దీపాలు వెలిగించి నిరూపిద్దాం

Nara Lokesh: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబరు 9, 2023) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఆనాటి చీకటి రోజులను, కఠిన పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అత్యంత భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘నిజం గెలిచింది’ (#NijamGelichindi) కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ధర్మమే గెలిచింది.. తెలుగు జాతికి కృతజ్ఞతలు.. 

చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించిన సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి “నిజం గెలవాలి” అంటూ అండగా నిలిచారని లోకేశ్ కొనియాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను వేధించేందుకు ‘గొడ్డలి పార్టీ’ పన్నిన కుట్రలన్నీ పటాపంచలయ్యాయని విమర్శించారు. కోర్టులు, ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చాయని, న్యాయస్థానాల్లో వరుసగా అక్రమ కేసులు కొట్టివేయబడటంతో అంతిమంగా సత్యమే గెలిచిందని స్పష్టం చేశారు.
53 దీపాలు వెలిగించి ‘నిజం గెలిచింది’ వేడుక..
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో లోకేశ్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు అక్రమంగా జైలులో గడిపిన 53 రోజులకు ప్రతీకగా.. పార్టీ కార్యాలయాలు, ప్రతి నాయకుడి ఇళ్ల వద్ద 53 దీపాలు వెలిగించి ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లు అక్రమ కేసులు, వేధింపులను తట్టుకుని కార్యకర్తలు చేసిన నిరంతర పోరాటాల వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.
‘3-P’ ఫార్ములా – టీడీపీ 3.0 వెర్షన్..
పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార మత్తులో కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని లోకేశ్ హితవు పలికారు.. ప్రతి నాయకుడు ఈ మూడింటినీ తీవ్రంగా పరిగణించాలని సూచించారు. వ్యక్తిగతంగా ప్రజలకు, క్యాడర్‌కు నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. “ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. పార్టీలో వ్యక్తిగత ఈగోలు, అహంకారాలకు చోటులేదు. ఇది టీడీపీ 3.0 వెర్షన్” అని స్పష్టం చేశారు.
ఉపాధి కల్పన – నిరుద్యోగులకు ఇచ్చిన మాట..
డీఎస్సీ, ఏపీపీఎస్సీ భర్తీలు..
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ అని, గత వైకాపా హయాంలో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందని లోకేశ్ ధ్వజమెత్తారు.
భారీ ఉద్యోగ నియామకాలు..

కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాబోయే ఐదేళ్లలో మొత్తం 30,000 టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని ప్రకటించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో, క్షేత్రస్థాయిలో ఐక్యంగా తిప్పికొట్టాలని నేతలకు పిలుపునిచ్చారు.

nara lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *