BRS MLCs Arrest: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధును, కోకాపేటలోని నివాసంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్‌ఐపై దాడి.. పీడీపీపీ (PDPP) చట్టం కింద మరో కేసు..
సోమవారం అసెంబ్లీ వద్ద “కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యం” పేరుతో బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై సైతం వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
మరోవైపు తాతా మధు వ్యాఖ్యలను నిరసిస్తూ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నివాసానికి భారీగా పోలీసులు చేరుకుని ఆంక్షలు విధించారు. శాసనసభ పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన రగడ అరెస్టులు, పోలీస్ కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రరూపం దాల్చింది.
