Viral News: తల్లి ప్రేమ, అనురాగానికి హద్దులు ఉండవు. బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు ఏ తల్లి మనసైనా తల్లడిల్లిపోతుంది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిడ్డ రక్షణకు ముందుకొస్తుంది. ఈ మాతృప్రేమ విషయంలో మనుషులే కాదు.. జంతువులు కూడా ఏమాత్రం తీసిపోవని నిరూపించే హృద్యమైన దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బురదలో కూరుకుపోయి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న చిన్ని పిల్ల ఏనుగును (ఏనుగు పిల్లను) ఓ తల్లి ఏనుగు సమయస్ఫూర్తితో కాపాడిన వీడియో నెటిజన్ల మనసులను హత్తుకుంటోంది.
తొండంతో ఒడ్డుకు లాగిన తల్లి ఏనుగు..
ఈ వీడియోను ‘నెక్స్ట్ జెన్ ఏఐ వరల్డ్’ (
nextgenaiworld) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో ఓ ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు లోతైన బురద గుంటలో కూరుకుపోయి, పైకి రాలేక ఆర్తనాదాలు చేస్తూ సహాయం కోసం చూస్తోంది.తన బిడ్డ ఆపదలో ఉండటాన్ని గమనించిన తల్లి ఏనుగు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. ఏమాత్రం తొట్రుపాటు పడకుండా తన బలమైన తొండంతో బురదలో ఉన్న పిల్లను ఒడుపుగా పైకి ఎత్తి, సురక్షితంగా బయటకు లాగింది. తల్లి ధైర్యం, ఆప్యాయతతో కూడిన ఈ సహాయం చూసి చూసేవారి హృదయాలు ద్రవించిపోతున్నాయి.
నెటిజన్లు భావోద్వేగం – ప్రశంసల జల్లు..
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వేల సంఖ్యలో వ్యూస్, లైకులతో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు భావోద్వేగపూరితంగా కామెంట్లు పెడుతున్నారు:
-
“తల్లి ప్రేమంటే ఇదే కదా.. ప్రపంచంలో దీనికి మించిన బంధం లేదు” అని ఒకరు కామెంట్ చేయగా..
-
“తల్లి ఎంతో తెలివిగా, ఓర్పుతో బిడ్డను కాపాడింది.. సెల్యూట్” అంటూ మరొకరు రాసుకొచ్చారు.
-
“బిడ్డల ప్రాణం కాపాడేందుకు తల్లి ప్రాణాలనైనా అర్పిస్తుంది అనడానికి ఈ వీడియోనే నిదర్శనం” అంటూ జంతువుల్లోని మాతృప్రేమను నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు.
View this post on Instagram
