YouTuber Nandana Arrest: సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబర్ నందనను (నందూస్ వరల్డ్ ఫేమ్) శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలోనే లుక్ ఔట్ నోటీసులు (LOC) జారీ అయి ఉండటంతో, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ ఇంకా ఆర్జీఐఏ భద్రతా సిబ్బంది ఆమెను గుర్తించి నిర్బంధించారు. అనంతరం తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీ వసూళ్లు..
లుక్ ఔట్ నోటీసులు అమల్లో ఉన్న నేపథ్యంలో, నందన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తమై ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ జాబ్ ఫ్రాడ్ కేసులో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తం వసూలు చేశారు? ఆమె భర్త పాత్రపై పూర్తి వివరాలను రాబట్టేందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
