Nandamuri Mokshagna Teja:

Nandamuri Mokshagna: ఫాంటసీ ఫిలిం తో మోక్షజ్ఞ ఎంట్రీ..?

Nandamuri Mokshagna Teja: నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎదురుచూపులకి ముగింపు పడింది. నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఖాయమైపోయింది. మూడు తరాల నట వారసత్వాన్ని మోస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైన నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్ – ‘బింబిసార’ దర్శకుడికి పగ్గాలు..

‘బింబిసార’ లాంటి సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్‌కి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ తీస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈయనే ఈ సినిమాని డైరెక్షన్ చేయనున్నారు.

బాలయ్య నమ్మకం పెట్టిన కథ..

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బోయపాటి శ్రీను వంటి ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ పేర్లు వినిపించినా, స్టోరీలో కొత్తదనం, విజువల్ స్పేస్ నచ్చి చివరకు వశిష్ఠ వైపే బాలకృష్ణ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సరైన డెబ్యూ కథ కోసం తగిన సమయం తీసుకున్న మోక్షజ్ఞ, వశిష్ఠ వినిపించిన కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వశిష్ఠ ఇప్పటివరకు తీసిన రెండు సినిమాలు సోషియో ఫాంటసీ కథలే కావడం విశేషం. ఇప్పుడు కూడా మోక్షజ్ఞ కోసం సోషియో ఫాంటసీ కథనే రాసుకున్నట్లు తెలుస్తోంది. అందరి హీరోల ఫస్ట్ సినిమాల్లాగా కాకుండా ఒక ఫాంటసీ సినిమాతో లాంచ్ అయితే తన ఎంట్రీ సినిమాతోనే ఆడియన్స్‌కి యాక్టింగ్‌లో, ఇంకా స్టోరీ సెలక్షన్‌లో కొత్తదనాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు.

మేకోవర్‌తో అదరగొట్టిన మోక్షజ్ఞ..

సినిమా అనౌన్స్ సందర్భంగా విడుదల చేసిన ఫొటోల్లో మోక్షజ్ఞ మేకోవర్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ, సినిమాల కోసం తీవ్రంగా శ్రమించి స్లిమ్‌గా, అత్యంత హ్యాండ్సమ్‌గా మారారు.

సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన, ఫిట్‌నెస్, డైలాగ్ డెలివరీలలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుని పక్కా కమర్షియల్ హీరోగా తనను తాను మలచుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం సమయంలోనే ఆయన నయా లుక్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది.

నందమూరి ఫ్యాన్స్‌లో రెట్టింపు ఉత్సాహం..

కళ్యాణ్ రామ్‌కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మోక్షజ్ఞ తొలి సినిమా చేస్తుండటం, అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోనూ కుటుంబపరంగా మంచి సంబంధాలు ఉండటంతో నందమూరి అభిమానులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ సినిమాను భారీగా స్వాగతిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుండగా, చిత్రంలో నటించే ఇతర నటీనటులు, అగ్ర సాంకేతిక నిపుణులు, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *