TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే శాసనసభ ప్రాంగణం రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వినూత్న నిరసనకు దిగింది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ నల్ల రంగు టీషర్టులు ధరించి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర వాగ్వాదం – తోపులాట..
తాము ప్రజాప్రతినిధులమని, లోపలికి వెళ్లి తీరాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి పలువురు నేతలు కిందపడిపోయారు. పోలీసుల తీరుపై తీవ్ర మనస్తాపం చెందిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గేటు ముందే కంటతడి పెట్టుకున్నారు.
చొక్కా విప్పి హరీశ్‌రావు నిరసన – కేటీఆర్ సహా నేతల అరెస్ట్
అసెంబ్లీ ప్రారంభం రోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరిగిన ఈ ఘర్షణ వాతావరణం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సభ లోపల, బయట అధికార-ప్రతిపక్షాల మధ్య మరింత వాడీవేడి పోరు తప్పదని స్పష్టమవుతోంది.
