Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరో సరికొత్త అధ్యాయానికి తెరలేపనుంది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం 7 గంటలకు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఇది ల్యాండ్‌మార్క్ పదో సీజన్ కావడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి. కింగ్ నాగార్జున మరోసారి తనదైన స్టైల్లో హోస్ట్‌గా అలరించబోతుండగా, ఈసారి షోను ‘దశావతారం’ థీమ్‌తో మునుపెన్నడూ చూడని ఎంటర్టైన్మెంట్, సరికొత్త ట్విస్టులు, టాస్కులతో ప్లాన్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు.
హౌస్‌లోకి 20 మంది? సెలబ్రిటీలతో పాటు కామనర్స్ సందడి!
ప్రస్తుతం అందరి దృష్టి హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపైనే నెలకొంది. ఈసారి మొత్తం 20 మంది కంటెస్టెంట్లతో హౌస్ కళకళలాడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘దశావతారం’ థీమ్‌కు తగ్గట్టుగా 10 మంది సెలబ్రిటీలు, అలాగే ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన మరో 10 మంది కామనర్లను బరిలోకి దించుతున్నారని సమాచారం.
గతంలో సీజన్ కంటెస్టెంట్ల వివరాలను కచ్చితంగా అంచనా వేసిన ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డితో పాటు సోషల్ మీడియా లీక్స్ ప్రకారం పరిశీలిస్తే, వినిపిస్తున్న పేర్లు ఇవే..
వినిపిస్తున్న సెలబ్రిటీల పేర్లు..
-
నటులు & బుల్లితెర తారలు: ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు, సీరియల్ నటుడు ముఖేష్ గౌడ (రిషి), సీరియల్ నటీమణులు చైత్ర రాయ్, దేబ్జానీ మోదక్, ‘చెన్నై లవ్ స్టోరీ’ నటుడు అదిత్ ఈశ్వరన్, టెంపర్ వంశీ.
-
కమెడియన్లు & యాంకర్లు: జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, యాంకర్ వర్షిణీ సౌందరరాజన్.
-
సోషల్ మీడియా & ఇన్ఫ్లూయెన్సర్లు: పాడ్‌కాస్టర్ సుధీర్ రెడ్డి, సృష్టి వ్యాకరణం, షాలినీ.
‘అగ్నిపరీక్ష’ కామనర్స్‌లో ఎవరెవరు?
సామాన్యుల విభాగంలో జరిగిన పోటీల నుంచి ఆర్జే చరణ్, రైతు-సింగర్ ఝాన్సీ, నవరసాలు ఆర్కే, రోహిత్, మిథిలేష్, రాజకుమారి, అమన్, అపూర్వ, దీపక్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరిని గ్రాండ్ లాంచ్‌లోనూ, మిగిలిన వారిలో కొందరిని తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. ఈ పేర్లపై అధికారిక ముద్ర పడాలంటే ఆదివారం సాయంత్రం జరిగే గ్రాండ్ లాంచ్ వరకు ఆగాల్సిందే. సెలబ్రిటీల హంగామా, సామాన్యుల పోరాటం కలిసి ఈ పదో సీజన్లో ఎలాంటి వినోదాన్ని పంచుతాయో వేచి చూడాలి.
