పీటీఐ (PTI) వార్తా సంస్థ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన ఇటీవల విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు గోప్యమైనవని పేర్కొంటూ ఫ్లై91 ప్రతినిధి ఈ విషయంపై నిర్దిష్ట వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
చరిత్ర సృష్టించిన పోరాటం – మిగ్-21తో ఎఫ్-16 కూల్చివేత..
2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. మరుసటి రోజు భారత గగనతలంలోకి చొరబడిన పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలను భారత పైలట్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.
అప్పటి వింగ్ కమాండర్ హోదాలో ఉన్న అభినందన్.. పాత తరం నాటి మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌తో పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని గగనతల పోరాటంలో (Dogfight) వెంబడించి కూల్చివేశారు. చరిత్రలో మిగ్-21తో ఎఫ్-16ను కూల్చిన ఏకైక పైలట్‌గా అభినందన్ రికార్డు సృష్టించారు.
ఆ పోరాటంలో తన విమానం కూడా దెబ్బతినడంతో ఆయన పాక్ ఆక్రమిత భూభాగంలో పారాచూట్ ద్వారా దిగాల్సి వచ్చింది. పాక్ సైన్యం మూడు రోజుల పాటు నిర్బంధించినా ఏమాత్రం బెదరకుండా ధైర్యం ప్రదర్శించారు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాకిస్థాన్ ఆయనను విడుదల చేసింది. ఆయన అసమాన సాహసానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం దేశ మూడో అత్యున్నత యుద్ధ శౌర్య పురస్కారం ‘వీరచక్ర’తో సత్కరించగా, వాయుసేన ఆయనను గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి కల్పించింది.
‘ఫ్లై91’ విమానయాన సంస్థ నేపథ్యం..
ప్రాంతీయ విమానయాన సంస్థ అయిన ఫ్లై91 (FLY91) 2024 మార్చిలో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆరు ఏటీఆర్ 72-600 (ATR 72-600) రకం విమానాలతో సర్వీసులు నడుపుతోంది. గోవా, హైదరాబాద్ నగరాలు ఈ సంస్థకు ప్రధాన కార్యకలాపాల స్థావరాలుగా (Bases) ఉన్నాయి. గగనతలంలో శత్రుదేశ విమానాలను గడగడలాడించిన యుద్ధ వీరుడు ఇప్పుడు ప్రయాణికుల విమానాలను నడిపే కమర్షియల్ పైలట్‌గా మారడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.