Crime News: హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హిట్ అండ్ రన్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ వేగంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన కేసులో బెయిల్ పొందిన కొన్ని గంటల్లోనే, అతడు గంజాయి పీలుస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు కేసు దర్యాప్తును మరో కోణంలో వేగవంతం చేశారు.
బెయిల్ మంజూరు.. ప్రాథమిక పరీక్షల్లో నెగెటివ్..
తెరపైకి గంజాయి వీడియో – ఎఫ్‌ఎస్‌ఎల్‌కు రక్త నమూనాలు..
తాజా ఆరోపణల నేపథ్యంలో సందీప్ నుంచి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి (FSL) పంపినట్లు వెల్లడించారు. ఈ అధునాతన ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా గత కొన్ని నెలల క్రితం ఏవైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నా నిర్ధారణ అవుతుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
