Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర దుమారం రేపిన మంత్రి వర్సెస్ సీఎం వివాదం క్లైమాక్స్‌కు చేరుకుంది. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేసింది. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
సాయంత్రంలోగా తన పదవికి రాజీనామా చేయాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు, ఒకవేళ ఆమె స్వచ్ఛందంగా తప్పుకోకపోతే కేబినెట్ నుంచి బర్తరఫ్ (Dismiss) చేసేందుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. రాజీనామా లేఖ రాకపోతే గవర్నర్‌కు బర్తరఫ్ సిఫార్సు లేఖను పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ తాజా రాజకీయ పరిణామాలు, అధిష్ఠానం హెచ్చరికల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ అత్యవసరంగా మీడియా ముందుకు వచ్చి తన వివరణ లేదా భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
