Chandrababu: ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి రంగంలో చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. నాలుగు నదులు, తూర్పు కనుమలు, అడవులు, జాతీయ రహదారులను దాటుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటను తాకాయి. పాయకరావుపేట వద్ద గోదారమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసుపు, కుంకుమ, చీర, పండ్లు సమర్పించి జలహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ ప్రాజెక్టు ప్రాధాన్యతను, ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
సింహాద్రి అప్పన్న, అరసవెల్లి వరకు గోదావరి జలాలు..
తొలిదశ లక్ష్యాలు – ఇంజనీరింగ్ విజయం..
ప్రతిపక్ష వైఖరిపై విమర్శలు..
విశాఖకు డేటా సెంటర్లు సహా అంతర్జాతీయ సంస్థలు వస్తే 5 టీఎంసీలే కాదు.. 500 టీఎంసీల నీటిని తరలించే శక్తి ప్రభుత్వానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ విస్తరణతో ఉత్తరాంధ్ర.. “ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర”గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
