Marella Surya Teja Wedding: ‘మహా న్యూస్’ (Mahaa News) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) మారెళ్ల సూర్య తేజ వివాహానికి రంగం సిద్ధమైంది. సూర్య తేజ, సాయి సుచిత్రల వివాహం సెప్టెంబర్ 5న ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా ఆహ్వానించారు. మహా న్యూస్ సీఎంపీ (CMD) మారెళ్ల వంశీకృష్ణ, ఆయన సతీమణి పద్మావతి దంపతులు.. కాబోయే వధూవరులు సూర్య తేజ, సాయి సుచిత్రలతో కలిసి హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి వెళ్లి వివాహ శుభలేఖను అందజేశారు.
ఆత్మీయ స్వాగతం – మెగాస్టార్ దంపతుల ఆశీస్సులు..
ఒంగోలులో జరిగే ఈ వివాహ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వివాహం అనంతరం హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు, టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.
