Crime News: హైదరాబాద్ శివారు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో కలకలం రేపిన యువ నర్స్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఒంటరిగా ఉన్న నర్స్‌పై లైంగిక దాడికి పాల్పడి, ఆపై అత్యంత దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. స్థానికంగా పనిచేసే మెకానిక్ మహ్మద్ సనావుల్లా ఖాన్ (34)ను అరెస్ట్ చేశారు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో పాటు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.
అసలేం జరిగింది?..
ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి కొన్ని నెలల క్రితం నగరానికి వచ్చి తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. దింతో ఆమె హాస్పిటల్ దగ్గరలోని హాస్టల్ లో చేరింది ఆమె తో పాటు ఇంకో ఇద్దరు అదే గదిలో ఉండేవారు. కానీ రాఖీ పండుగ సందర్భంగా రూమ్‌మేట్స్ ఊరికి వెళ్లడంతో ఆమె గదిలో ఒంటరిగా ఉంది.
ఆసుపత్రి పక్కనే ఉన్న మెకానిక్ షాపులో పనిచేసే బిహార్‌కు చెందిన సనావుల్లా ఖాన్.. ఆసుపత్రి నర్సుల కదలికలను గత నెల నుండి గమనిస్తూ వచ్చాడు. దింతో యువతి ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టి అర్ధరాత్రి వేళ గ్రిల్స్ లేని కిటికీ గుండా గదిలోకి ప్రవేశించాడు.
దర్యాప్తులో దొరికిపోయిన నిందితుడు..
