Yash Mother

Yash Mother: కేజీఎఫ్ కంటే ముందే యశ్ స్టార్.. అల్లు అరవింద్ పాత వ్యాఖ్యలపై చర్చ!

Yash Mother: ‘టాక్సిక్’ (Toxic) సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో సోషల్ మీడియాలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ స్టార్‌డమ్‌పై వస్తున్న విమర్శలకు ఆయన తల్లి ఇచ్చిన ఘాటు సమాధానం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ‘కేజీఎఫ్’ (KGF) ఫ్రాంచైజీకి ముందే యశ్ ప్రస్థానం ఏమిటో తెలుసుకోవాలంటూ ట్రోలర్లతో పాటు గతంలో సినీ వర్గాల్లో వచ్చిన వ్యాఖ్యలకు ఆమె తనదైన శైలిలో గట్టి బదులిచ్చారు.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగాడు.. యశ్ తల్లి స్పందన..

తన కుమారుడి సినీ ప్రయాణం గురించి యశ్ తల్లి ఎంతో భావోద్వేగంగా మాట్లాడుతూ..  యశ్ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఇంకా డబ్బు లేదా పలుకుబడి లేకుండా కేవలం తన సొంత ప్రతిభ, కష్టంతోనే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడని స్పష్టం చేశారు.
కేజీఎఫ్ కంటే ముందే స్టార్..
కేజీఎఫ్‌కి ముందు యశ్ ఎవరంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏమీ అనామకుడు కాదు.. కేజీఎఫ్ రాకముందే కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు అని ఆమె గట్టిగా తేల్చిచెప్పారు. ఏ అండదండలు లేకుండా స్వశక్తితో ఇంతటి విజయాన్ని సాధించిన కొడుకును కన్నందుకు ఒక తల్లిగా తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

అల్లు అరవింద్ పాత వ్యాఖ్యలతో ముడిపెడుతున్న నెటిజన్లు..

యశ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ.. గతంలో ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె పరోక్షంగా ఇచ్చిన సమాధానమేనని నెటిజన్లు, అభిమానులు చర్చించుకుంటున్నారు.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. “కేజీఎఫ్‌కి ముందు యశ్ ఎవరు? కేవలం హీరో స్టార్‌డమ్ మాత్రమే కాకుండా ఆ సినిమా మేకింగ్, గ్రాండ్‌నెస్‌తోనే పెద్ద విజయం సాధించింది” అని వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో యశ్ తల్లి ఇచ్చిన బలమైన వివరణ ట్రోలర్ల నోళ్లు మూయించేలా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కానీ అల్లు అరవింద్ ఆ సమాధానం చెప్పడానికి కూడా కారణాలు లేకుండా పోలేదు. ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ని మీరు పెద్ద సినిమాలు చేయకుండా ఉండడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ యశ్ పేరుని ఓ ఉదాహరణగా చెప్పారు. పెద్ద సినిమా చేయాలంటే ఒక స్టార్ హీరోకి బడ్జెట్ లోంచి 25% వరకు ఇవ్వవలసి ఉంటుంది. దీంతో కొన్ని సార్లు సినిమా క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా కంటెంట్ ఉన్న చిన్న సినిమాని తీసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేయొచ్చు కదా అంటూ అప్పుడు చెప్పిన ఉదాహరణే యశ్ పేరు. కేజీఎఫ్ కి ముందు యశ్ ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలుసు కదా అని చెప్పారు. ఇప్పుడు తాజాగా టాక్సిక్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ వ్యాఖ్యలను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *