King 100: టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున సినీ ప్రస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా సందడి మొదలైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకను ఇస్తూ.. ఈ ల్యాండ్‌మార్క్ మూవీ టైటిల్ ఇంకా ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ టీమ్.. అధికారికంగా విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉన్నట్లే ఈ సినిమాకు ‘కింగ్ 100’ (King 100) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం స్వయంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.
మనుషుల్లో రెండు రకాలు.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
క్రేజీ కాంబినేషన్ – మళ్లీ వెండితెరపై నాగ్-టబు మ్యాజిక్:
హిట్ పెయిర్ రీ-యూనియన్: గతంలో ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలతో వెండితెరపై మాయ చేసిన నాగార్జున-టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతోంది.
రాక్ స్టార్ సంగీతం – డిసెంబర్ 24న థియేటర్లలోకి:
‘నితమ్ ఒరు వానమ్’ (ఆకాశం) ఫేమ్ రా కార్తీక్ ఈసారి భావోద్వేగాలు, యాక్షన్, మిస్టరీ అంశాల కలయికతో పక్కా కమర్షియల్ వినోదాన్ని సిద్ధం చేశారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. అక్కినేని అభిమానుల భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ల్యాండ్‌మార్క్ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.
