Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన జీవితంలో అత్యంత మధురమైన మాతృత్వపు దశను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్న ఆమె, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కాబోయే తల్లులు, కొత్త తల్లులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో తన ప్రెగ్నెన్సీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
“నేనూ 11 కిలోలు పెరిగాను” – బరువుపై నిజాయితీగా సమంత..
-
బరువు పెరగడంపై స్పందన:గర్భధారణ సమయంలో బరువు పెరగడంపై ఒక మహిళా అభిమాని తన అనుభవాన్ని పంచుకోగా.. “మీ బాధ నాకు అర్థమవుతోంది. నేను కూడా ఇప్పటికే సుమారు 11 కిలోల బరువు పెరిగాను” అని సమంత వెల్లడించారు. అయితే, ఈ మార్పులను చూసి కంగారు పడకుండా ప్రతి క్షణాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
-
మరింత ధైర్యం వచ్చింది:మాతృత్వం గురించి మాట్లాడుతూ.. “మొదట్లో ఈ దశ నన్ను తీవ్రమైన కంగారుకు గురిచేస్తుందేమో అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా ఇది నాలో సరికొత్త శక్తిని, ధైర్యాన్ని నింపింది. ఈ ప్రయాణం నన్ను మరింత దృఢంగా మార్చింది” అని పేర్కొన్నారు.
AMA సెషన్‌లో ఆసక్తికర ముచ్చట్లు..
-
తల్లిగా ఉండటం ఫుల్ టైమ్ జాబ్..ఒక కొత్త తల్లి తన దినచర్యను వివరిస్తూ రోజంతా బిడ్డకు పాలు పట్టడం, త్రేన్పు తెప్పించడం, నిద్రపుచ్చడానికే సరిపోతోందని చెప్పగా.. “అది వింటుంటేనే ఒక ఫుల్ టైమ్ ఉద్యోగంలా అనిపిస్తోంది” అని సమంత చమత్కరించారు.
-
బాబు లేదా పాప పేరు ఎంపిక..పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? అని అడగ్గా.. “పేరు ఎంపిక నేను ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉంది. బహుశా మీ అందరి సాయం అవసరమవుతుంది అనుకుంటున్నాను” అని సరదాగా బదులిచ్చారు.
-
మాతృత్వానికి మాన్యువల్ ఉంటే బాగుండేది..“మాతృత్వానికి ఎలాంటి మాన్యువల్ ఉండదు” అన్న అభిమాని మాటకు సమంత స్పందిస్తూ.. “నిజమే, మాతృత్వం అనేది ఒక అద్భుతమైన, జీవితాన్ని మార్చే మాయా అనుభవం. దీనికొక మాన్యువల్ ఉండి ఉంటే బాగుండేదేమో” అని వ్యాఖ్యానించారు.
వియత్నాం వెకేషన్ & డిసెంబర్‌లో డెలివరీ..
ఇటీవల భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియత్నాంలో ‘బేబీమూన్’ ఎంజాయ్ చేసిన సమంత, బేబీ బంప్‌తో డిన్నర్ డేట్స్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న ఆమె ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన ప్రేమ లభించింది. ఈ దంపతులు ఈ ఏడాది చివర్లో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.
