Nepal Floods: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో విరుచుకుపడ్డ ఆకస్మిక వరద పెను విషాదాన్ని మిగిల్చింది. కైలాస మానససరోవర యాత్రలో భాగంగా వెళ్లిన ఈశా ఫౌండేషన్ (Isha Foundation) కు చెందిన ‘S3 గ్రూప్’ యాత్రికులు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ అత్యంత బాధాతప్త హృదయంతో ఒక అధికారిక లేఖ ద్వారా వెల్లడించారు.
వారం క్రితం తాము బస చేసిన సరిహద్దు ఇమ్మిగ్రేషన్ భవనం మొత్తం వరద ధాటికి కొట్టుకుపోయిందని, సుమారు 80 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఆ సమయంలో అక్కడే చిక్కుకుపోయిందని ఆయన తెలిపారు.
గల్లంతైన 80 మంది యాత్రికుల వివరాలు (S3 గ్రూప్)..
ఈ బృందంలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు సహా 18 దేశాలకు చెందిన భక్తులు ఉన్నారు..
-
ప్రధాన దేశాల పౌరులు..
-
అమెరికా: 22 మంది
-
కెనడా: 12 మంది
-
ఆస్ట్రేలియా: 11 మంది
-
యునైటెడ్ కింగ్‌డమ్ (UK): 9 మంది
-
జర్మనీ: 4 మంది
-
ఫ్రాన్స్: 3 మంది | నేపాల్: 3 మంది
-
నెదర్లాండ్స్: 2 | న్యూజిలాండ్: 2 | సింగపూర్: 2 | స్పెయిన్: 2
-
ఫిన్‌లాండ్, హంగేరీ, ఇజ్రాయెల్, లిథువేనియా, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, ఒక్కొక్కరు చొప్పున ఈ బృందంలో ఉన్నారు.
-
-
సిబ్బంది: వీరితో పాటు ముగ్గురు వాలంటీర్లు, ఆశ్రమం నుంచి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఓ డాక్టర్ కూడా హోటల్ సమీపంలోనే ఉండిపోయారు.
ఉదయం 9:05కు చివరి మెసేజ్.. 9:14కే జల ప్రళయం..
-
చివరి సంభాషణ: రెండు దశాబ్దాలుగా పూర్తిస్థాయి ఈశాంగగా పనిచేస్తున్న గ్రూప్ లీడర్ ప్రవీణ్ నుంచి ఉదయం 9:05 గంటలకు “ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి చేరుకున్నాం” అని మెసేజ్ వచ్చింది.
-
ఆ తర్వాతే దుర్ఘటన: సరిగ్గా ఉదయం 9:14 గంటలకు ఆకస్మిక వరద ముంచెత్తింది. ప్రవీణ్ నేపాల్ సరిహద్దు దాటి ఉంటే అతని ఫోన్ సిగ్నల్ యాక్టివేట్ అయ్యేదని, కానీ ఎలాంటి సిగ్నల్ రాకపోవడంతో బృందం మొత్తం ఆ భవనంలోనే ఉండిపోయినట్లు తెలుస్తోందని సద్గురు వివరించారు.
రాయబార కార్యాలయాల ద్వారా ముమ్మర ప్రయత్నాలు:
-
రెస్క్యూ కోసం అనుమతులు: సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సద్గురు స్వయంగా వెళ్లాలని భావించినప్పటికీ రోడ్లు కొట్టుకుపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు తెగిపోవడంతో భారత్, చైనా, అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా ప్రత్యేక అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
-
కుటుంబాలకు సమాచారం: పరిస్థితిపై అధికారికంగా పూర్తి ధ్రువీకరణ రానప్పటికీ, విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాల ఎంబసీలతో పాటు యాత్రికుల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారు.
మొత్తం మీద స్థానిక గైడ్ల కుటుంబాలు, ప్రజలు కలిపి దాదాపు 1500 మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురై ఉండవచ్చు.. ఎవరినీ కాపాడలేని నిస్సహాయ స్థితి కలచివేస్తోంది అని సద్గురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


