Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ఏలూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..
సహాయక చర్యల్లో ఏపీ యంత్రాంగం – పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి..
బస్సు ఏలూరు వెళ్తుండటంతో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, సహాయక చర్యల కోసం తెలంగాణ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఏపీ అధికారులను ఆదేశించారు. దీంతో ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై, సూర్యాపేట పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల వివరాలు సేకరిస్తోంది.
