Folk Dancer: తెలంగాణ జానపద గీతాలతో యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్, సింగర్ ఈశ్వర్ సాయి వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తోటి మహిళా ఫోక్ డ్యాన్సర్‌తో ఆయన సన్నిహితంగా ఉన్న సమయంలో భార్య నేరుగా పట్టుకున్నట్లు చెబుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రెడ్డి భవన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య – వీడియో వైరల్:
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం.. వేములవాడలోని ఒక ప్రైవేట్ గదిలో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఈశ్వర్ సాయి ఉండగా, ఆయన భార్య శరణ్య బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో యువతి బెడ్‌పై కూర్చుని ఉండగా, ఈశ్వర్ సాయి వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
-
భార్య శరణ్య ఆవేదన: గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోందని భార్య శరణ్య ఆరోపించారు. “ఆ నటి నాతో ఎంతో సన్నిహితంగా ఉంటూనే.. నా భర్తను తన బుట్టలో వేసుకుని మా సంసారాన్ని నాశనం చేసింది. ఈ విషయం తెలిసి గతంలోనే నేను ఆత్మహత్యాయత్నం కూడా చేశాను” అంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
-
పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ: ఈ వ్యవహారంపై భార్య శరణ్య వేములవాడ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు.
యూట్యూబ్ ట్రెండింగ్ నుంచి పోలీస్ కేసుల దాకా:
ఇటీవల విడుదలైన ‘బాసింగ బలాలు’ తెలంగాణ ఫోక్ సాంగ్‌తో ఈశ్వర్ సాయి పేరు మారుమోగిపోయింది. ఆ పాట మిలియన్ల వ్యూస్ సాధించి ప్రతి పల్లెలో, పెళ్లిళ్లలో డీజే సాంగ్‌గా ట్రెండ్ అయింది. గతంలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ‘రాతిరి రాతిరి’, ‘ప్రమీల’ వంటి పలు విజయవంతమైన ఫోక్ సాంగ్స్‌లో జోడీగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో కళాకారుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై జానపద కళాకారులు, నెటిజన్లలో తీవ్ర చర్చ జరుగుతోంది.
