Youtube New Rules

Youtube New Rules: యూట్యూబ్‌ క్రియేటర్లకు షాకింగ్ న్యూస్.. మోనిటైజేషన్ నిబంధనలు డబుల్..!

Youtube New Rules: కొత్తగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ సొంతంగా ఛానెల్ నడుపుతూ డబ్బులు సంపాదించాలనుకునే కొత్త క్రియేటర్లకు గూగుల్ సంస్థ గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. గడిచిన కొన్నేళ్లలో ప్లాట్‌ఫారమ్‌లో క్రియేటర్ల సంఖ్య ఊహించని రేంజ్‌లో పెరగడంతో.. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) మోనిటైజేషన్ అర్హత నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది.

సాధారణ నిబంధనలను చివరిగా 2018లో మార్చిన యూట్యూబ్.. ఇప్పుడు 2027 ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వచ్చేలా సరికొత్త అర్హత ప్రమాణాలను ప్రకటించింది.
కొత్త క్రియేటర్లకు ‘డబుల్’ టార్గెట్!
ఇకపై యూట్యూబ్ నుంచి తమ ఛానెల్‌పై అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా ఆదాయం పొందే అర్హత సాధించాలంటే క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల ఆడియన్స్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది..
పాత నిబంధనలు (ప్రస్తుతం) కొత్త నిబంధనలు (ఫిబ్రవరి 1, 2027 నుండి)
1,000 సబ్‌స్క్రైబర్లు ఉండాలి సబ్‌స్క్రైబర్ల నిబంధన మారలేదు.. 
ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ ఏడాదిలో (365 రోజుల్లో) 8,000 గంటల వాచ్ టైమ్
90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) షార్ట్స్ వ్యూస్
పాత క్రియేటర్లకు మినహాయింపు: ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగమై ఆదాయం పొందుతున్న పాత క్రియేటర్లకు ఈ కొత్త అర్హతల నుంచి మినహాయింపు లభించింది. వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
షార్ట్స్ క్రియేటర్లకు నిలకడ ముఖ్యం – యూట్యూబ్ షాపింగ్ బోనస్‌లు!
కేవలం కొత్త నిబంధనలే కాకుండా షార్ట్స్ క్రియేటర్లకు కూడా యూట్యూబ్ కీలక సూచనలు చేసింది..
  1. 10 మిలియన్ వ్యూస్ మెయింటెనెన్స్: షార్ట్స్ ద్వారా నిరంతరం అడ్వర్టైజ్‌మెంట్ ఆదాయం పొందుతున్న క్రియేటర్లు 90 రోజుల వ్యవధిలో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్‌ను నిలకడగా కొనసాగించాల్సి ఉంటుంది. వ్యూస్ అంతకంటే తగ్గితే షార్ట్స్ ఆదాయం మాత్రమే ఆగుతుంది. కానీ ఛానెల్‌లో లాంగ్ వీడియోల ద్వారా వచ్చే ఆదాయం యథాతథంగా వస్తుంది.
  2. ప్రీమియం లైట్ (Premium Lite) విస్తరణ: తక్కువ ధరలో యాడ్స్ లేకుండా వీడియోలు చూసే ‘ప్రీమియం లైట్’ సబ్‌స్క్రిప్షన్‌ను అన్ని దేశాలకూ అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా వచ్చే నెట్ రెవెన్యూలో క్రియేటర్లకు వాచ్ టైమ్ ఆధారంగా (లాంగ్ వీడియోలకు 55%, షార్ట్స్‌కు 45%) షేర్ ఇస్తారు.
  3. కొత్త ఇన్సెంటివ్‌లు: చిన్న క్రియేటర్లకు ఊరటగా ‘యూట్యూబ్ షాపింగ్’ (YouTube Shopping), బ్రాండ్ డీల్స్ ఇంకా ట్రెండింగ్ బోనస్‌ల ద్వారా ప్రత్యామ్నాయంగా డబ్బు సంపాదించే వెసులుబాటు కల్పిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వ్యూస్ వస్తున్నాయని, అలాగే టీవీల్లో రోజూ బిలియన్ గంటలకు పైగా వాచ్ టైమ్ నమోదు అవుతోందని యూట్యూబ్ తెలిపింది. ఈ భారీ రద్దీకి అనుగుణంగానే నాణ్యమైన క్రియేటర్లను ప్రోత్సహించడానికి ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *