Uday Kiran: ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే ఎలాంటి సినీ అభిమానికైనా గుండెల్లో ఎక్కడో ఒక సన్నని బాధ కలుగుతుంది. డెబ్యూ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుని, వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొడుతూ నాటి కుర్రకారును ఊపేసిన లవర్ బాయ్ ఆయన. కాలక్రమేణా పరిస్థితులు ఎదురుతిరిగి, ఆయన మనల్ని విడిచి దాదాపు 12 ఏళ్లు దాటిపోతున్నా.. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు టాలీవుడ్‌లో సజీవంగానే ఉన్నాయి.
తాజాగా ఉదయ్ కిరణ్ కెరీర్‌కు, సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘ఒక్కడు’ సినిమాకు ఉన్న ఒక ఆసక్తికరమైన లింక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఉదయ్ కిరణ్ తెచ్చిన లాభాలే ‘ఒక్కడు’కి ప్రాణం!
మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఒక్కడు’ సినిమా సక్సెస్ వెనుక ఉదయ్ కిరణ్ సినిమా తెచ్చిపెట్టిన లాభాలే ప్రధాన కారణమని ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్. రాజు (MS Raju) స్వయంగా వెల్లడించారు..
-
‘మనసంతా నువ్వే’ సృష్టించిన సంచలనం: 2001లో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా ఎమ్.ఎస్. రాజు నిర్మాణంలో వచ్చిన ‘మనసంతా నువ్వే’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆ సమయానికి నిర్మాతకు ఊహించని రేంజ్‌లో భారీ లాభాలను అందించింది.
-
‘ఒక్కడు’ కొనేందుకు ముందుకు రాని డిస్ట్రిబ్యూటర్లు: ఆ తర్వాత మహేష్ బాబుతో ‘ఒక్కడు’ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అయితే అప్పట్లో మహేష్ బాబు మార్కెట్ కంటే ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. దానికి తోడు మహేష్ నటించిన ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ సినిమాలు ప్లాప్ అవ్వడంతో ‘ఒక్కడు’ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.
ఓన్ రిలీజ్ రిస్క్ – తిరగబడ్డ ఇండస్ట్రీ రికార్డులు!
మహేష్ బాబు సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొనకపోవడంతో నిర్మాత ఎమ్.ఎస్. రాజు ధైర్యం చేసి సొంతంగా (Own Release) విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.
-
ఆదుకున్న ‘మనసంతా నువ్వే’ లాభాలు: అప్పటికే ‘మనసంతా నువ్వే’ సినిమా ద్వారా వచ్చిన భారీ లాభాలు చేతిలో ఉండటంతో, డిస్ట్రిబ్యూటర్లు లేకపోయినా ఆర్థికంగా తట్టుకుని ఒక్కడు సినిమాను రిలీజ్ చేయగలిగారు.
-
చరిత్ర సృష్టించిన మహేష్ బాబు: విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఒక్కడు’ సినిమా ఆ రోజుల్లోనే రూ. 30 కోట్ల షేర్ సాధించి, మహేష్ బాబును స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్లింది.
అలా ఉదయ్ కిరణ్ నటించిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమా తెచ్చిపెట్టిన ధైర్యమే, మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ‘ఒక్కడు’ రూపుదిద్దుకోవడానికి పునాదిగా మారింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
