AP Draft Voter List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యంత్రాంగం అత్యంత పారదర్శకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) – 2026 ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఈవో.. అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు మిస్ కాకుండా చూడటమే ఈసీఐ (ECI) ప్రధాన ధ్యేయమని, అలాగే అనర్హులు చేరకుండా పారదర్శకమైన వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ముసాయిదా సర్వేలో తేలిన ప్రధాన ముఖ్యాంశాలు..
-
ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.16 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 89.22% మంది (3.71 కోట్ల మంది) తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించారు.
-
మరణించిన ఓటర్లు: సుదీర్ఘ తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 15.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు.
-
రెండు చోట్ల ఓట్లు (డూప్లికేట్): సుమారు 7.37 లక్షల మంది పేర్లు రెండు లేదా మూడు చోట్ల నమోదైనట్లు తేలింది. ఇలాంటి వారి పేర్లను పరిశీలించి, వారి ప్రాధాన్యతను బట్టి ఒకే చోట మాత్రమే ఓటును కొనసాగిస్తారు.
-
చిరునామా మారినవారు: మరో 22.30 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారినట్లు (Shifted) లేదా గైర్హాజరైనట్లు (Absent/Untraceable) గుర్తించారు.
ముఖ్య గమనిక: ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, అధికారుల క్షేత్రస్థాయి విచారణ లేకుండా ఏ ఒక్క నిజమైన ఓటరు పేరును జాబితా నుంచి తొలగించబోమని సీఈవో వివేక్ యాదవ్ హామీ ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు & కీలక వివరాలు:
ఒకవేళ పొరపాటున మీ పేరు ముసాయిదా జాబితాలో లేకపోయినా, లేదా కొత్తగా ఓటు హక్కు పొందాలన్నా కంగారు పడాల్సిన పనిలేదు:
-
ఫారం – 6 (Form 6): నిజమైన అర్హులైన ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలతో ‘ఫారం-6’ పూరించి మళ్లీ ఓటరుగా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
-
ఫారం – 7 (Form 7): అనర్హుల తొలగింపు లేదా అభ్యంతరాల సమర్పణ కోసం.
-
ఫారం – 8 (Form 8): పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, చిరునామా సవరణల కోసం.
ఆన్లైన్లో మీ ఓటును ఎలా చెక్ చేసుకోవాలి?
ఈసీఐ అందుబాటులోకి తెచ్చిన ‘ECI Net App’ లేదా అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in సందర్శించి మీ ఓటు భద్రంగా ఉందో లేదో సరిచూసుకోవచ్చు:
-
voters.eci.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.
-
“Search in Electoral Roll” మీద క్లిక్ చేయండి.
-
మీ ఓటరు కార్డు నంబర్ (EPIC Number) లేదా వివరాలను నమోదు చేసి సెర్చ్ చేయండి.
-
మీ సమాచారంలో ఏమైనా తప్పులు ఉన్నా, పేరు నమోదు కాకపోయినా ఆగస్టు 30 లోపు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోండి.
