Uday Krishna Reddy: మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడ వద్ద అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో నిఘా ఉంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మహిళా అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ నిమిత్తం ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
