Uday Krishna Reddy

IPS Trainee Uday Krishna: నేను పారిపోలేదు.. విచారణకు సహకరిస్తా

IPS Trainee Uday Krishna: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (SVP NPA)లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తొలిసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు.

1. సొంత ఊరిలోనే ఉన్నా.. పోలీసులకు సహకరిస్తా

పోలీసుల విచారణకు భయపడి పరారయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.. తన నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే సొంత ఊరైన ‘ఊళ్లపాలెం’ వచ్చానని తెలిపారు.

పోలీసులు గాలించిన హైదరాబాద్ అడ్రస్‌లు కేవలం తన తాత్కాలిక చిరునామాలు మాత్రమేనని, ప్రకాశం జిల్లాలోని తన శాశ్వత చిరునామాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. చట్టం ఇంకా పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

2. కేసు నేపథ్యం

శిక్షణలో ఉన్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు, నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు.ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో పరారయ్యారంటూ వార్తలు రాగా, ఆయన నేరుగా స్పందించి ముగింపు పలికారు.ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని, త్వరలోనే అధికారులను కలిసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఉదయ్ కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *