Anna Konidela

Anna Konidela: నన్ను ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవండి..!

Anna Konidela: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. త్వరలో తన పుట్టినరోజు వస్తుండడంతో అభిమానులకు, నెటిజన్లకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ సందేశాన్ని పంచుకున్నారు.

1. ఇంటిపేరు మార్పుపై స్పష్టత

చాలా కాలంగా ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నా, సరైన సమయం కోసం వేచి చూశానని ఆమె పేర్కొన్నారు. పెళ్లికి ముందు అందరికీ తాను ‘అన్నా లెజినోవా’గానే తెలుసని, మ్యారేజ్ సర్టిఫికెట్‌లో ఆ పేరు కనిపించడం అదే చివరిసారి అని చెప్పారు.పెళ్లయిన రోజు నుంచే తన భర్త ఇంటిపేరును స్వీకరించి ‘అన్నా కొణిదెల’గా మారానని స్పష్టం చేశారు. ఇకపై అందరూ తనను ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవాలని, ఆ పేరులోనే తనకు ఎంతో సంతోషం లభిస్తుందని కోరారు.

2. తొలి పర్యటన జ్ఞాపకం

తన పోస్ట్‌తో పాటు ఒక ప్రత్యేకమైన ఫొటోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి పర్యటనలో రష్యాలోని ‘సెయింట్ పీటర్స్‌బర్గ్’లో తీసుకున్న ఫొటో అని వెల్లడించారు.

3. అభిమానుల స్పందన

అన్నా కొణిదెల పోస్ట్‌పై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆమెకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇకపై కొణిదెల ఇంటిపేరుతోనే పిలుస్తామని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెలల వివాహం 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగింది. వీరికి కుమార్తె పోలెనా అంజనా, కుమారుడు మార్క్ శంకర్ సంతానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *