Ramayana

Ramayana: ప్రమోషన్లకే రూ. 375 కోట్లు.. ‘రామాయణ’ వరల్డ్ వైడ్ రిలీజ్ కి భారీ ప్లాన్..!

Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana). బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ విజువల్ వండర్‌లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

1. ట్రైలర్ ఎందుకు వాయిదా పడింది?

అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన అధికారిక ట్రైలర్ జూలై 24న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీనికి కారణం హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాని గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది. దింతో హాలీవుడ్ లెవెల్లో గ్లోబల్ ప్రమోషన్ ప్లాన్ చేయడంలో భాగంగానే ఈ ట్రైలర్ రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

2. ప్రమోషన్ల బడ్జెట్ చూస్తే మైండ్ బ్లాకే!

ఈ సినిమా పబ్లిసిటీ బడ్జెట్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విదేశాల్లో ప్రమోషన్ల కోసం సోనీ పిక్చర్స్ రూ. 235 కోట్లు, భారతీయ నిర్మాతలు మరో రూ. 140 కోట్లు కేటాయించనున్నారట.అంటే కేవలం ప్రమోషన్లు, మార్కెటింగ్ కోసమే దాదాపు రూ. 375 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక సినిమా పబ్లిసిటీ కోసం ఇంత మొత్తం కేటాయించడం ఇదే తొలిసారి.

3. ఆస్కార్ దిగ్గజాల సంగీతం & విజువల్స్

ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్ (Hans Zimmer), ఏ.ఆర్. రెహమాన్ కలిసి సంగీతం అందిస్తుండటం సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అత్యుత్తమ గ్రాఫిక్స్, ఐమాక్స్ ఫార్మాట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కొత్త ట్రైలర్ తేదీ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *