Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురై స్వల్పంగా గాయపడ్డారు. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న ఆయన తాజా చిత్రం ‘NBK 111’ షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మంచు మనోజ్, బాలకృష్ణలపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ అనుకోకుండా కాలుజారి పడటంతో ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
ఆసుపత్రిలో వైద్యులు బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించి, పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయం చాలా స్వల్పమైనదేనని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి (Rest) తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆసుపత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. బాలయ్య గాయపడ్డారని తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
‘NBK 111’ సినిమా విశేషాలు
‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం ఇది.ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
