Jana Nayagan

Jana Nayagan: సీఎం విజయ్ ‘జననాయగన్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్!

Jana Nayagan: సినిమా అనుకున్న టైమ్‌కి థియేటర్లలోకి రాకుండా లేట్ అయితే.. ఆటోమేటిక్‌గా దానిపై ఉండే హైప్, క్రేజ్ తగ్గిపోతుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లలో చాలా సినిమాలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమా ‘జననాయగన్’.

ఈ సినిమాను నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాల్సింది. కానీ సెన్సార్ ఇష్యూస్, మరికొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ గ్యాప్‌లోనే విజయ్ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. తన మొదటి ఎన్నికల బరిలోనే ఘన విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి (CM) పీఠాన్ని అధిరోహించారు. ఆయన సీఎం కావడంతో ఒక్కసారిగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. అన్ని ఇబ్బందులను దాటుకుని ఈనెల జూలై 24న సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సీఎం అయ్యాక వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో క్రేజ్ పెరిగినప్పటికీ.. ఈ సినిమాను కొన్ని నెగెటివ్ విషయాలు టెన్షన్ పెడుతున్నాయి.

సినిమా రిలీజ్ బాగా లేట్ అవ్వడం ఒక మైనస్ అయితే.. లోకేష్ కనగరాజ్, నెల్సన్ లాంటి స్టార్ డైరెక్టర్లు కాకుండా నార్మల్ దర్శకుడితో ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అంచనాలు నార్మల్‌గానే ఉన్నాయి. దానికి తోడు కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ లీకైన వీడియోలకు నెగెటివ్ టాక్ రావడం మరో మైనస్. అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే.. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. విజయ్‌కు పిల్లలు, టీనేజర్లలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కానీ ‘ఎ’ సర్టిఫికేట్ వల్ల వాళ్లు థియేటర్లకు వచ్చే ఛాన్స్ లేదు. ఇది కలెక్షన్లపై దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది.

ఇన్ని మైనస్‌లు ఉన్నా.. ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక్క పెద్ద ప్లస్ పాయింట్ ‘దళపతి’ విజయ్ ఇమేజ్ మాత్రమే. రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన విజయ్ నటించిన చివరి సినిమా ఇదే కావడం, పైగా ఆయన సీఎం అయ్యాక థియేటర్లలోకి వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో విపరీతమైన ఎమోషనల్ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతానికైతే విజయ్ క్రేజ్ మినహా మిగిలినవన్నీ మైనస్‌లుగానే కనిపిస్తున్నాయి. మరి కేవలం విజయ్ ఇమేజ్‌ను నమ్ముకుని వస్తున్న ఈ సినిమా జూలై 24న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *