Sourav Ganguly biopic Dada Movie first look released

Sourav Ganguly: పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..!

Sourav Ganguly: లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అధికారికంగా విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు. ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్‌లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్ష‌ణాలు గుర్తులుగా మిగిలాయి.

‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమా క్రికెట్‌ ఆట ఆడిన వ్యక్తి మాత్రమే కాకుండా దానిని మార్చిన మనిషి అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒక ప్రతిభావంతుడైన యువ క్రికెటర్‌గా ప్రారంభమై భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన గంగూలీ ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్క‌రిస్తుంది. పట్టుదల, పోరాడే శక్తి, నమ్మకం వంటి లక్షణాలు భారత క్రికెట్‌ను ఎలా కొత్తగా మలిచాయో, ఒక తరం మొత్తానికి ఎలా ప్రేరణగా నిలిచాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నారు.

‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమాకు విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో, లవ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027, మే 14న థియేటర్లలో భారీ ఎత్తున‌ విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *