IPS Transfers

IPS Transfers: ఏపీలో ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీలు.. కొత్త పోస్టింగ్‌లను చేపట్టిన అధికారులు!

IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పలువురు ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొత్త అధికారులను నియమిస్తూ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి..

  • నవజ్యోతి మిశ్రా: మార్కాపురం ఓఎస్డీ (OSD) అడ్మిన్‌గా నియామకం.

  • పాటిల్ దేవ్ రాజ్ మనీష్: రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ.

  • మందా జావలి అల్ఫోన్స్: పోలవరం ఓఎస్డీ (అడ్మిన్)గా బాధ్యతలు.

  • మనోజ్ రామనాథ్ హెగ్డే: అమరావతి ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా నియామకం.

  • రోహిత్ కుమార్ చౌదరి: పల్నాడు అదనపు ఎస్పీగా బాధ్యతలు.

  • సుస్మిత: నంద్యాల ఏఎస్పీగా బదిలీ.

పరిపాలనా సౌలభ్యం కోసం మరియు శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది. నియామక ఉత్తర్వులు అందుకున్న అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *