Akhil Raj Incident: సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేం హీరో అఖిల్ రాజ్ వర్సెస్ ఫుడ్ డెలివరీ బాయ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, డెలివరీ బాయ్స్ అంతా కలిసి హీరో కారును ముట్టడించడం లాంటి హైడ్రామా తర్వాత.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మొదట్లో హీరో అఖిల్ రాజ్‌పై తీవ్రంగా మండిపడ్డ నెటిజన్లు, ఇప్పుడు సదరు డెలివరీ బాయ్ స్వయంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడంతో షాక్‌కు గురవుతున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, తెరవెనుక జరిగిన అసలు కథ ఇక్కడ ఉంది:
గొడవకు కారణం: ఒక ‘నాన్‌వెజ్’ రాంగ్ డెలివరీ!
ఈ వివాదమంతా గచ్చిబౌలిలోని అరుణ రెసిడెన్సీలో జరిగిన ఒక చిన్న పొరపాటుతోనే మొదలైంది. అఖిల్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న ‘చేలం రెసిడెన్సీ’ లోని ఫ్లాట్ నెంబర్ 202కి రావాల్సిన ఒక నాన్‌వెజ్ పార్సిల్‌ను డెలివరీ బాయ్ రమేశ్.. పొరపాటున అఖిల్ ఇంటి (ఫ్లాట్ 201) అడ్రస్‌లో ఇచ్చేసాడు.
-
శాకాహార కుటుంబం: హీరో అఖిల్ రాజ్ కుటుంబం పూర్తిగా బ్రాహ్మణ (శాకాహార) కుటుంబం కావడంతో, వారి ఇంట్లోకి నాన్‌వెజ్ ఆర్డర్ రావడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఇంట్లో ఎవరో ఆర్డర్ చేశారనుకుని అఖిల్ తండ్రి ఆ పార్సిల్ తీసుకోగా, తెలియక అఖిల్ తల్లి దాన్ని ఓపెన్ చేశారు.
-
వెటకారపు సమాధానం: సుమారు 20 నిమిషాల తర్వాత తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చిన డెలివరీ బాయ్‌ను.. అఖిల్ తల్లి ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. “ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా” అంటూ రమేశ్ వెటకారంగా మాట్లాడటంతో.. తల్లిని అన్న మాటలకు ఆగ్రహించిన అఖిల్ రంగంలోకి దిగాడు. దాంతో డెలివరీ బాయ్ వెంటనే ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.
ఇన్స్టాగ్రామ్ వీడియో.. గచ్చిబౌలిలో రేగిన మంట!
ఆ తర్వాత డెలివరీ బాయ్ రమేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కన్నీరు పెట్టుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. హీరో అఖిల్ తనను దారుణంగా దూషించాడని, తనపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించారని ఆరోపించాడు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో.. గచ్చిబౌలి ఏరియాలోని డెలివరీ బాయ్స్ అంతా ఒక్కటయ్యారు.
1.అపార్ట్మెంట్ ముట్టడి:
మీడియా ముందుకు డెలివరీ బాయ్: సంచలన నిజాలు ఇవే!
సోషల్ మీడియాలో హీరోపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న తరుణంలో.. సదరు డెలివరీ బాయ్ రమేశ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో అసలు నిజాలను ఒప్పుకుంటూ బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
డెలివరీ బాయ్ ఓపెన్ స్టేట్మెంట్: “ఆ రోజు నా పుట్టినరోజు కావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల దౌడ భాగంలో దెబ్బ తగలడంతో.. హీరో ఎక్కడ కొడతాడో అనే ఆత్మరక్షణ భయంతోనే వీడియో తీశాను. ఆవేశంలో ఇన్‌స్టాలో పెట్టాను కానీ ఇంత రచ్చ అవుతుందనుకోలేదు. అఖిల్ తల్లి నాపై ఉమ్మి వేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు.”
“ట్రోలింగ్ ఆపేయండి.. తప్పు నాదే!”
చివరగా పబ్లిక్కు, తోటి డెలివరీ బాయ్‌లకు విజ్ఞప్తి చేస్తూ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఈ ఘటనలో ఇద్దరి తప్పు ఉంది, కానీ ఎక్కువ తప్పు నాదే. నేను ఎవరినీ రెచ్చగొట్టలేదు, గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టలేదు. హీరో అఖిల్ రాజ్‌ను, వారి కుటుంబాన్ని బూతులు తిట్టడం, ట్రోల్ చేయడం దయచేసి ఇప్పుడైనా ఆపేయండి. నా తప్పును నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను, చట్టపరంగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధం” అంటూ వివాదానికి ముగింపు పలికాడు.
