NBK111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. గతంలో బాలయ్య బాబుకు ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ అందించిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా విడుదల విషయంలో సినిమా టీమ్ ఒక ఆసక్తికరమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమాను ఎలాగైనా సరే దసరా పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ ప్రాథమిక ప్లాన్. అయితే, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఒకవేళ అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోతే.. సేఫ్ సైడ్ కింద డిసెంబర్ 4వ తేదీని బ్యాకప్ రిలీజ్ డేట్‌గా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతానికి దసరా డెడ్‌లైన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదనే పట్టుదలతో చిత్ర యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ చాలా టైట్‌గా ప్లాన్ చేయడంతో ఎక్కడా బ్రేక్స్ లేకుండా వర్క్ సాగుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించగా.. తాజాగా రిలీజైన హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేనిల కాంబినేషన్‌కు ట్రేడ్ వర్గాల్లో ఉన్న తిరుగులేని క్రేజ్, దానికి తోడు వస్తున్న సానుకూల బజ్ కారణంగా ‘NBK111’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
