I am Handsome: కే ఫిలిమ్స్ బ్యానర్ పై దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా “ఐ యామ్ హ్యాండ్సమ్”. ఇందులో అన్విష హీరోయిన్ గా నటించింది.
కథ ఎలా ఉందంటే:
ఇది 2009లో జరిగే కథ. ఒక పల్లెటూరికి మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన టౌన్ డాక్టర్ ను, ఆ ఊరిలో ఉండే ఒక మామూలు కుర్రాడు ప్రేమిస్తాడు. ఆమె అతని ప్రేమను అంగీకరించిందా? వీళ్ళ ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
సినిమా ఎలా ఉందంటే:
మొదటి సినిమానే అయినా దుర్గా దేవ్ హీరోగా, డైరెక్టర్ గా చాలా బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాడు. డాక్టర్ పాత్రలో అన్విష చాలా సహజంగా, గ్లామర్ కు పోకుండా చక్కగా నటించింది. హీరో తండ్రిగా కిట్టయ్య యాక్టింగ్ సూపర్. 2009 నాటి పల్లెటూరి వాతావరణాన్ని, అందాలను కెమెరామెన్ నాగార్జున కళ్ళకు కట్టినట్లు చూపించారు. మ్యూజిక్ కూడా బాగుంది. కథ పాతదే అయినా, ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే మంచి ఎమోషనల్ మూవీ ఇది.
3/5
