Summer Holidays

Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!

Summer Holidays: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎండల తీవ్రత ఇంకా వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభం (Schools Reopening Date) తేదీని మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12న తెరుచుకోవాల్సిన స్కూళ్లను ఈనెల 15వ తేదీకి వాయిదా వేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12వ తేదీన పున:ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, క్యాలెండర్ ప్రకారం ఆ తర్వాతి రోజుల్లో వరుసగా సెలవులు వచ్చాయి:

  • జూన్ 13: రెండో శనివారం (Second Saturday)

  • జూన్ 14: ఆదివారం (Sunday)

స్కూళ్లు తెరిచిన మరుసటి రోజే వరుసగా రెండు రోజులు సెలవులు వస్తుండటంతో.. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఈ క్రమంలోనే స్కూల్స్ రీఓపెన్ డేట్‌ను జూన్ 15 (సోమవారం) కు మారుస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.

జులై 11న స్కూళ్లు పనిచేస్తాయి!

జూన్ నెలలో సెలవుల పొడిగింపు కారణంగా తగ్గిన విద్యా సమయాన్ని (Working Days) తిరిగి భర్తీ చేసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. వచ్చే నెలలో, అంటే జులై 11న వచ్చే రెండో శనివారాన్ని (Second Saturday) సాధారణ పనిదినంగా (Working Day) ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజున విద్యార్థులందరికీ యథావిధిగా తరగతులు జరుగుతాయని స్పష్టం చేసింది.

అంగన్‌వాడీలు కూడా జూన్ 15 నుంచే!

మరోవైపు, రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల పున:ప్రారంభ తేదీని కూడా ప్రభుత్వం ఇదివరకే పొడిగించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూన్ 2వ తేదీన అంగన్‌వాడీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదవుతుండటంతో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సెలవులను పొడిగించారు. దీంతో స్కూళ్లతో పాటే అంగన్‌వాడీ కేంద్రాలు కూడా జూన్ 15వ తేదీ నుంచే తిరిగి యథావిధిగా పనిచేయడం ప్రారంభిస్తాయని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *