Peddi Collections

Peddi Collections: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో అన్ని రికార్డ్స్ బ్రేక్

Peddi Collections: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. గత కొద్ది రోజులుగా థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలు లేక వెలవెలబోయిన లోటును ‘పెద్ది’ పూర్తిగా తీర్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.

తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘పెద్ది’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రియల్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్’గా అవతరించింది. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

నెక్స్ట్ లెవల్‌కు చెర్రీ క్రేజ్.. మరో బిగ్గెస్ట్ ఓపెనర్!

రామ్ చరణ్ ఊరమాస్ క్రేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు అద్భుతమైన టేకింగ్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించాయి. దీంతో తొలిరోజే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి.

రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన చెర్రీ.. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశ పరిచినప్పటికీ, ఇప్పుడు ‘పెద్ది’తో ఆ లోటును భర్తీ చేశారు. ఈ భారీ వసూళ్లతో రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

లాంగ్ రన్‌లో ఇండస్ట్రీ రికార్డులు ఖాయం!

మొదటి రోజే ఏకంగా రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడంతో, లాంగ్ రన్‌లో ‘పెద్ది’గాడి ఆటకు మరిన్ని ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ల సునామీ ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని సినీ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాగా, ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఏదేమైనా ‘పెద్ది’గాడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *