Free Netflix: భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) తమ ప్లస్ మెంబర్‌షిప్ వినియోగదారుల కోసం ఒక సరికొత్త అదిరిపోయే ప్రయోజనాన్ని తీసుకువస్తోంది. మనదేశంలోని కొంతమంది ఎంపిక చేసిన ప్లస్ యూజర్ల కోసం కంపెనీ ‘నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్’ (Netflix Mobile Subscription) ఆఫర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఆఫర్ కింద అర్హులైన వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక నెల పాటు నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.
అయితే, ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందడానికి కంపెనీ కొన్ని షరతులు ఇంకా నెలవారీ షాపింగ్ ప్రమాణాలను విధించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం:
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందడం ఎలా?
మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ అయి ఉండి, ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ పొందాలనుకుంటే ఒకే నెలలో క్రింది షాపింగ్ ప్రమాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒకే నెలలో ఫ్లిప్‌కార్ట్‌లో కనీసం 4 ఆర్డర్‌లు విజయవంతంగా పూర్తి చేయాలి.మీరు చేసే ప్రతి ఆర్డర్ విలువ కనీసం రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.ఈ 4 ఆర్డర్‌లను మీరు మెయిన్ ఫ్లిప్‌కార్ట్ యాప్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ (Flipkart Minutes) లేదా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ (Flipkart Grocery) లో వేటిని ఉపయోగించి చేసినా సరే.. అవన్నీ ఈ ఆఫర్ పరిధిలోకి లెక్కించబడతాయి.
ఆఫర్ పొందే ముందు ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి!
నెట్‌ఫ్లిక్స్ అధికారిక వెబ్‌సైట్ సైతం ఈ ఆఫర్ వివరాలను అప్‌డేట్ చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఉచిత ఆఫర్‌ను క్లెయిమ్ చేసే ముందు వినియోగదారులు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనంలో ఉంచుకోవాలి:
-
క్యాన్సిలేషన్స్ వర్తించవు: మీరు ఆర్డర్ చేసిన తర్వాత రద్దు చేసిన (Cancelled) లేదా రిటర్న్ ఇచ్చి వాపసు పొందిన (Refunded) కొనుగోళ్లు ఆ ‘నాలుగు కొనుగోళ్ల’ పరిమితిలోకి లెక్కించబడవు.
-
మొబైల్ ప్లాన్ మాత్రమే: ఈ ఆఫర్ కింద లభించేది ‘నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్’ మాత్రమే. అంటే మీరు ఒకేసారి ఒక మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే కంటెంట్‌ను వీక్షించగలరు.
-
టీవీ సపోర్ట్ లేదు: ఈ ప్లాన్ ద్వారా మీరు కంటెంట్‌ను స్టాండర్డ్ క్వాలిటీ (Standard Quality) లో చూడవచ్చు. కానీ, దీన్ని స్మార్ట్ టీవీలో లేదా ల్యాప్‌టాప్‌లో స్ట్రీమ్ చేయడం కుదరదు.
ఈ ఆఫర్ ప్లస్ సభ్యులందరికీ అందుబాటులో ఉందా?
ప్రముఖ టెక్ మీడియా సంస్థ ‘డిజిట్’ (Digit) నివేదిక ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్‌ను ప్రస్తుతం దశలవారీగా (Phased Manner) రోలవుట్ చేస్తోంది. అందువల్ల ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం కొంతమంది వినియోగదారులు తమ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఈ ఆఫర్‌కు సంబంధించిన డైరెక్ట్ బ్యానర్‌ను చూస్తుండగా, మరికొంతమందికి మాత్రం “వెయిట్‌లిస్ట్‌లో చేరండి” (Join Waitlist) అనే ఆప్షన్ కనిపిస్తోంది. ఈ సరికొత్త ఆఫర్ ప్లస్ మెంబర్లందరికీ పూర్తి స్థాయిలో ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందనే దానిపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేవారైతే.. వెంటనే మీ యాప్ ఓపెన్ చేసి ఈ ఆఫర్ మీకు లైవ్ అయిందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి.
