Balayya-Koratala Film: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనగానే ఇండస్ట్రీలో మామూలు హైప్ లేదు. ‘దేవర’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన కొరటాల శివ, అదే జోరును బాలయ్య ప్రాజెక్ట్‌తో కూడా కంటిన్యూ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి వర్క్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో, అసలు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉంటారా అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది.
మొదట్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎస్.ఎస్. థమన్ లేదా అనిరుధ్ రవిచందర్ పేర్లు బాగా వినిపించాయి. ముఖ్యంగా అనిరుధ్‌ని దాదాపు ఫిక్స్ అనుకున్నారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు రావడం వల్లే ఆయన తప్పుకున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇక్కడే ఓ సర్ప్రైజింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం జీవీ ప్రకాష్ కుమార్ పేరు ఈ రేసులో బలంగా వినిపిస్తోంది.
జీవీ ప్రకాష్ రీసెంట్ టైమ్స్‌లో పెద్ద స్టార్ హీరోల మాస్ మసాలా సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. కానీ ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ‘లక్కీ భాస్కర్’తో సూపర్ హిట్ కొట్టిన ఆయన, ఆ తర్వాత ‘ఇరుముడి’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్నారు.
అయినప్పటికీ, బాలయ్య సినిమా అంటే ఆ ఊపే వేరు. ఇలాంటి హై-వోల్టేజ్ మాస్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అంటే జీవీ ప్రకాష్‌కి నెక్స్ట్ లెవల్ ఛాలెంజ్, అలాగే పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలకు థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లే ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ కాంబో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి చివరకు ఈ ప్రాజెక్ట్‌లోకి జీవీ ప్రకాష్ ఎంట్రీ ఇస్తారా లేదా మరొకరు వస్తారా అన్నది చూడాలి.
