Irumudi: మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని పవర్ ఫుల్ ‘గ్లిమ్స్’ను ఈనెల 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఈ సినిమాలో రవితేజ ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన ‘అయ్యప్ప మాల’ వేసుకున్న లుక్ బయటకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భక్తితో పాటు మాస్ యాక్షన్ కలగలిసిన కథ కావడంతో, రవితేజను దర్శకుడు శివ నిర్వాణ ఏ రేంజ్లో చూపిస్తారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 3న వచ్చే గ్లిమ్స్ వీడియో సినిమా స్థాయిని చెప్పేలా అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తోంది!
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 3న విడుదల చేసే గ్లిమ్స్ వీడియోలోనే సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలోని రవితేజ డైలాగ్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
రవితేజ ఇటీవల ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో తన పంథా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరులో ‘ఇరుముడి’తో మళ్లీ పక్కా సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా ద్వారా మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తారో లేదో చూడాలి.
#Irumudi Glimpse out on this 3rd and will get attached to #Peddi
Looking at August Release! pic.twitter.com/Zdj4ULV0Ds
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 1, 2026
